- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరా మాకు నీతులు చెప్పేది..? సీఎం KCRపై Kishan Reddy విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్‌లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపునివ్వడం రాజ్యాంగానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు, రాజ్యాంగబద్ధ పదవులకు వారిచ్చే గౌరవానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థలను పదే పదే అవమాన పరుస్తున్నారని అన్నారు. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ముందు పార్లమెంట్ ఆవరణంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు, ఎంపీలనే కాదు చివరకు గవర్నర్లు, ప్రధాని, రాష్ట్రపతిని కూడా గౌరవించడం రాదని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా సస్పెండ్ చేస్తున్న మీరా మాకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు. ప్రతిసారి రాజీనామాకు సిద్ధం అని చెప్పే బీఆర్ఎస్ నాయకులను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని, మరో 3-4 నెలల్లో ఎన్నికలు రాగానే మీరు రాజీనామా చేసే పని లేకుండానే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Also Read...