- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్.. దమ్ముంటే ఆ ఉత్తరాలు బయటపెట్టు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: తల, తోక లేకుండా మాట్లాడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటని, ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే మెడికల్ కాలేజీల కోసం రాసిన ఉత్తరాలు బయటపెట్టాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోలేదని దుయ్యబట్టారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామని, తమకు బీసీ సంఘాల మద్దతు కూడా ఉందన్నారు.
బీసీ సీఎంను చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని నిలదీశారు. ముఖ్యమంత్రి.. తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేసినట్టు ఫాంహౌజ్‌లో నిద్రపోయి పగటి కలలు కంటున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే అవినీతి, అస్థిరత తప్పదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలని మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి ఆ పార్టీల విధానమని ఫైరయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఆలస్యమవుతుందో సీఎం సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలోని రైతులు డిసెంబర్ 3వ తేదీ వరకు వడ్లను అమ్ముకోవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బీజేపీ అధికారంలోకి రాబోతోందని, వరి కనీస ధర రూ.3,100కు పెంచుతోందని ఆయన చెప్పారు. రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కూడా రైతులకు ఉచిత కరెంట్ అందిస్తారని ఆయన పేర్కొన్నారు. కంపెనీలు దొంగతనంగా వాడుకునే విద్యుత్ బిల్లును సైతం రైతుల ఖాతాలో వేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అకౌంటబులిటీ కోసమే మీటర్లు పెట్టాలని నిర్మలా సీతారామన్ చెప్పారని, తను మాట్లాడింది వాస్తవమేనని ఆయన పేర్కరొన్నారు. ఒక మహిళా మంత్రిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడానికి కేసీఆర్‌కు సిగ్గుందా అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.