- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల చేతికి చిప్పే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: సంక్షేమం కొనసాగుతూ పెట్టుబడులు మరింత రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యం అవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బ తీసిందని ఆరోపించారు. ప్రభుత్వం భూములు, రింగ్ రోడ్డు, ఆరు నెలల ముందుగా లిక్కర్ టెండర్లు వేయకుంటే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల చేతికి చిప్ప, కాంగ్రెస్ గెలిస్తే భస్మాసుర హస్తమే మిగులుతుందని ధ్వజమెత్తారు.
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించామన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని.. వారి ప్రచార వాహనాలను ప్రజలే స్వచ్ఛందంగా అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆ పార్టీవి ఫేక్ గ్యారెంటీలు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ గెలవాలన్నారు. బీజేపీ బీసీలు, ఎస్సీల నుంచి మద్దతు రావడం సంతోషంగా ఉందన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీల పోటీ:
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని.. కర్నాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలకే దిక్కులేదని మరి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చెప్పిన అనేక పథకాలకు హామీలు ఇచ్చి వాటిని మొదలు పెట్టక ముందే కొత్త పథకాలకు హామీ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నాళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అని మండిపడ్డారు. గెలవరని తెలిసే బీజేపీ బీసీ సీఎం హామీ ఇచ్చారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. మున్సిపల్, దుబ్బాక, హుజారాబాద్‌లో ఆ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదని గుర్తు చేశారు.
జాబ్ కేలండర్ ద్వారా నిరుద్యోగ యువతలోని నిరాశ, నిస్పృహలను తొలగించబోతున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రజల సంపదను దోచుకున్నారని బీజేపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు అవినీతి లేని పరిపాలన అందించబోతున్నట్టు చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు అన్ని రంగాలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసి ప్రజలను ఆదుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలారంభంలోనే ఎలా జీతాలు వస్తున్నాయో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలోని కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు ఒకటవ తేదీ లోపలే వచ్చేలా చూస్తామన్నారు.