- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay : బోనాల పండగ వేళ అక్బరుద్దీన్ ఓవైసీకి బండి సంజయ్ సంచలన సవాల్
దిశ, వెబ్‌డెస్క్: బోనాల పండగ వేళ ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన సవాల్ విసిరారు. ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం గోడ మీద పిల్లి పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎవరు అధికారంలోకి వస్తే వారి పక్కన చేరతారని అన్నారు. అక్బరుద్దీన్, సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అయ్యారని సెటైర్లు వేశారు. అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని.. దమ్ముంటే కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీని బరిలో ఉంచాలని డిమాండ్ చేశారు. ఆ స్థానంలో పోటీ చేయిస్తే అక్కడ ఒక్కో బీజేపీ కార్యకర్తను ఒక్కో ఇంటికి ఇన్‌ఛార్జ్‌గా నియమించి డిపాజిట్ రాకుండా చేస్తామని సవాల్ విసిరారు.
మా పండుగలను పాతబస్తీలో జరుపుకునే పరిస్తితి లేదని కొంతమంది భక్తులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. అని పాతబస్తీలో కూడా గల్లీ గల్లీలో మన పండుగ జరుగుతుందన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం హిందువుల పండుగలను కాపాడటం లేదన్నారు. హైదరాబాద్‌లో బోనాల పండుగకు ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చిందని రూ.33 కోట్లు రంజాన్ పండుగకు ఇచ్చారని బండి సీరియస్ అయ్యారు. హిందువులు ఎం పాపం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌ను గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. . హిందువుల తరపున తాను పక్కా మాట్లాడుతా అన్నారు. అలా అని వేరే మతానికి వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని బండి కోరారు.