- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముస్లిం రిజర్వేషన్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవేళ్లలో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్దంగా ఉన్నాయని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.
కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని.. ఒవైసీ ఎజెండానే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్లదని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు భయపడే బీఆర్ఎస్ విమోచన దినోవత్సవాన్ని జరపట్లేదని అన్నారు. ఎంఐఎంకు బీజేపీ భయపడదని పేర్కొన్నారు. కేసీఆర్ ఆరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. బీఆర్ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.