- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ ‘మహాధర్నా’
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేవైఎం నేతలు ధర్నాకు దిగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా ఈనెల 20న మహాధర్నాకు పిలుపునిచ్చారు. ప్రధానంగా ఏడు డిమాండ్లతో ఈ ధర్నాకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ పిలుపునిచ్చారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, గ్రూప్-2లో 783 పోస్టులను 2వేలకు పెంచాలని, గ్రూప్-3లో 1,365 పోస్టులను 3 వేల పోస్టులకు పెంచాలని, అదేవిధంగా మెగా డీఎస్సీ పేరిట 25 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అంతే కాకుండా డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షల మధ్య కనీస వ్యవధిని పెంచాలని, నిరుద్యోగులకు రూ.4000 భృతి అందించాలని, హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కానీ, పోలీసులు తమపై అత్యుత్సాహం ప్రదర్శించారని, దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు అండగా తాము ఉంటామని అన్నారు. కానీ, నిరుద్యోగులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
నిరుద్యోగులను అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని, ఇటీవల జేఎన్టీయూలో కార్యక్రమానికి పాల్గొన్న ఆయన ధర్నా చేసే వారంతా నిజమైన నిరుద్యోగులు కాదని అవమానించారని విమర్శలు చేశారు. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ ఉండాలాని చెప్పి ఇప్పుడు ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరి 24 గంటలు దాటినా పర్మిషన్ ఇవ్వలేదని అన్నారు. దీనిని బట్టి సీఎం, మంత్రులు ఎంత భయంతో ఉన్నారని అర్థమవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ధర్నా చేస్తామని మహేందర్ తెలిపారు. నిరుద్యోగులను ఓటు వేయమని వారి కాళ్లు మొక్కి చివరకు వారి సమస్యలు పరిష్కరించమంటే రేవంత్ ముఖం చాటేశారని మహేందర్ ఫైర్ అయ్యారు.
బీజేవైఎం ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకుంటున్నారని, ముందే హౌజ్ అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఇంత భయానక పరిస్థితికి చేరుకున్నారంటే దీన్ని బట్టి కాంగ్రెస్ ఓటమి అర్థం అవుతోందని అన్నారు. ఫ్లెక్సీల్లో మెగా డీఎస్పీ వేశామని హస్తం పార్టీ మోసం చేస్తోందని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే బీఆర్ఎస్‌కు ఘోరీ కట్టినట్లే కాంగ్రెస్‌కు కడతారని హెచ్చరించారు. రేవంత్ ఎమ్మెల్యేలను కొనడమే పనిగా పెట్టుకున్నారని, నిరుద్యోగ సమస్య మాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. నిరుద్యోగుల మధ్య కాంగ్రెస్ నేతలను పంపించి వారి మధ్య చిచ్చు పెడుతున్నారని మహేందర్ ధ్వజమెత్తారు.