రాంగ్​ట్రీట్మెంట్ ఇచ్చిన ఇద్దరు డాక్టర్లు సస్పెండ్

by GSrikanth |
రాంగ్​ట్రీట్మెంట్ ఇచ్చిన ఇద్దరు డాక్టర్లు సస్పెండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇద్దరి డాక్టర్లపై వేటు పడింది. తప్పుడు చికిత్సను అందించారంటూ తెలంగాణ మెడికల్​కంప్లైట్ లో నమోదైన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని టీఎంసీ చైర్మన్​డాక్టర్ రాజలింగం గురువారం పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ వ్యాధి చికిత్సలో నిర్లక్ష్యం చేయగా, పేషెంట్ చనిపోయినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఎంక్వైరీ తర్వాత మూడు నెలలపాటు చికిత్సను చేసిన డాక్టర్​శ్రీకాంత్‌పై టీఎంసీ సస్పెన్సన్​వేశారు. ఇక ఓపేషెంట్‌కు 14–07.2021న లెప్ట్​లెగ్​ప్యాక్చర్​అయింది. ఆ తర్వాత రోజు కరన్​ఎం పటేల్​అనే డాక్టర్ విచిత్రంగా రైట్ లెగ్‌కు సర్జరీ చేశారు. ఆపరేషన్​అనంతరం గుర్తించి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, ఆరు నెలల పాటు టీఎంసీ సస్పెన్షన్​ చేసింది.

Advertisement

Next Story

Most Viewed