ఆవిర్భావం జరిగినా.. ఇంకా అక్కడ మారని TRS పేరు?

by samatah |   ( Updated:2022-12-10 10:16:46.0  )
ఆవిర్భావం జరిగినా.. ఇంకా అక్కడ మారని TRS పేరు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం పంపిన పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు కూడా చేశారు. కానీ సోషల్ మీడియా ఖాతాలు ఇంకా టీఆర్ఎస్ పేరు మీదే కొనసాగడం ఆసక్తిగా మారింది. దసరా రోజు టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్టు ఆ పార్టీ అధినేత కేసీఆర్ అనౌన్స్ చేశాక ఆ పార్టీ నేతలు, అనుచరులు, అభిమానులు అనేక మంది సోషల్ మీడియాలో తమ ఖాతాల్లో టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ గా మార్పులు చేసుకున్నారు.

తాజాగా శుక్రవారం అధికారికంగా పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిపోయింది. ఈ ప్రక్రియ ముగిసి 24 గంటల దాటిపోయినా టీఆర్ఎస్ కు చెందిన అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు అదే పేరుతో కొనసాగుతున్నాయి. ఇక పార్టీ అధికారిక వెబ్ సైట్ సైతం టీఆర్ఎస్ పేరుతోనే కంటిన్యూ కావడం నెటిజన్లను ఆశ్చర్యపరిస్తోంది. అయితే ట్విట్టర్, ఫేస్ బుక్ కవర్ పేజీలలో మాత్రం భారత రాష్ట్ర సమితి అని మార్పులు చేసినప్పటికి అకౌంట్ నేమ్స్ మాత్రం ఇంకా టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే దర్శనం ఇస్తుండటంపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వీకిపిడియాలో మాత్రం భారత రాష్ట్ర సమితి బ్లాగ్ కనిపిస్తోంది.

Also Read: తెలంగాణతో కేసీఆర్ పేగు బంధం తెగిపోయింది : కోదండరాం

Advertisement

Next Story

Most Viewed