నడక దారి భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |
నడక దారి భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. నడక మార్గం గుండా వచ్చే 60 శాతం భక్తుల వద్ద దర్శన టికెట్లు ఉండటం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

అది పూర్తి కాగానే టోకెన్ల జారీ ని ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన వారికి తిరుమలలోని ఎస్ఎన్ జీహెచ్, ఏటీజీహెచ్ అతిథి గృహాల్లో 88 గదులు కేటాయించినట్లు పేర్కొన్నారు. తిరుమలలో గదుల కేటాయింపు విచారణ కేంద్రాల్లో రాగి బాటిళ్ల విక్రయానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారానికి తిరుమలకు 10 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed