ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు ఊరేళ్లవాళ్లకు 10 శాతం రాయితీ

by Mahesh |   ( Updated:2023-09-26 14:38:28.0  )
ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు ఊరేళ్లవాళ్లకు 10 శాతం రాయితీ
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 23న దసరా పండుగ జరగనున్న నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయాలున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది.

Advertisement

Next Story