నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు.. హైకోర్టులో రాజశేఖర్ భార్య పిటిషన్

by GSrikanth |
నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు.. హైకోర్టులో రాజశేఖర్ భార్య పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక నిందితుడిగా వ్యవహరించిన రాజశేఖర్ భార్య సుచరిత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజశేఖర్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని పిటిషన్‌లో వెల్లడించింది. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని రాజశేఖర్ భార్య కోర్టును కోరింది. అయితే, కస్టడీకి తీసుకునే ముందు నిందితులకు (రాజశేఖర్‌కు) వైద్య పరీక్షలు చేయించామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. కస్టడీ ముగిశాక కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు చేయిస్తామని న్యాయవాది తెలిపారు.

నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరుగుతుందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ విషయమై స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన భార్య సుచరిత న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో, సమస్య ఉంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది.

Advertisement

Next Story