TSPSC ప‌రీక్షల తేదీలు ఖరారు

by GSrikanth |
TSPSC ప‌రీక్షల తేదీలు ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల కారణంగా వాయిదా వేసిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీపీబీవో), వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల రాత‌ప‌రీక్షల తేదీలు ఖరారు చేశారు. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. జులై 8వ తేదీన టీపీబీవో రాత‌ప‌రీక్షను, జులై 13, 14 తేదీల్లో వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ పోస్టుల‌ రాత‌ప‌రీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించ‌నున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. రాత‌ప‌రీక్షల‌కు వారం రోజుల ముందు హాల్‌టికెట్లు www.tspsc.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు సూచించింది.

Advertisement

Next Story

Most Viewed