- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TSPSC : NOC లేకుండానే ఎగ్జామ్ రాసిన ఉద్యోగులు
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న ఉద్యోగులు ఎలాంటి అనుమతి లేకుండానే పరీక్ష రాసినట్లుగా తెలుస్తోంది. వీరంతా ఎన్ వోసీ తీసుకోకుండా గ్రూప్ -1 పరీక్ష రాసినట్లుగా గుర్తించారు. ఇందులో మొత్తం 26 మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నట్లుగా తేల్చారు. కమిషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే ఉద్యోగులు ఎగ్జామ్ రాయడం సంచలనంగా మారింది. 4 నెలల లీవ్ లు వాడుకోకుండానే పర్మినెంట్ ఉద్యోగులు ఎగ్జామ్ రాశారు.
అదే విధంగా ఉద్యోగానికి రిజైన్ చేయకుండానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎగ్జామ్ రాశారని తేలింది. ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో చాలా మంది గ్రూప్ - 1 రాస్తే అందులో 10 మంది క్వాలిఫై కావడం, వాళ్లలో కొందరికి 100కి పైగా మార్కులు రావడం కలకలం రేపుతోంది. ఈ 10 మందిలో ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాగా, ఏడుగురు రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉన్నట్లు తెలిసింది. పేపర్ లీకేజీ వ్యవహారంతో గ్రూప్ - 1 ఎగ్జామ్ రాసిన వారిక సంబంధముందా? లేదా అనే అంశంపై సిట్ ఫోకస్ చేసింది.