- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AE పరీక్షపై కొనసాగుతోన్న సస్పెన్స్.. రేపు నిర్ణయం ప్రకటిస్తామన్న TSPSC చైర్మన్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై బోర్డు చైర్మన్ జనార్థన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్ మీట్ పెడుతున్నానని అన్నారు. పేపర్ లీక్ ఘటనలపై వస్తున్న వదంతులను ఆపేందుకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలపై సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులను నమ్మెద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పేపర్ మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదని చెప్పారు.
నిందితుడు ప్రవీణ్ కంప్యూటర్ హ్యాక్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు ఎవరూ గ్రూప్ 1 పరీక్ష రాయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష పేపర్ సైతం లీక్ అయినట్లు అనుమానం ఉందని.. దానికి సంబంధించిన నివేదిక రేపు వస్తోందన్నారు. ఆ నివేదిక వచ్చాక పరీక్ష కొనసాగించాలా.. రద్దు చేయాలా అని రేపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పేపర్ల లీక్ ఘటనలో ఉన్న ఐదుగురు నిందితులు ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోతారన్నారు.
తెలంగాణ వచ్చాక దాదాపు 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ప్రస్తుతం దాదాపు మరో 25 వేల ఉద్యోగాల భర్తీ జరుగుతోందని వెల్లడించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా మల్టిపుల్ జంబ్లింగ్ చేశామని చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు, జవాబులు మల్టిపుల్ జంబ్లింగ్ చేశామన్నారు. పరీక్ష విధానాల్లో టీఎస్పీఎస్సీ అనేక కొత్త విధానాలు తీసుకువచ్చిందన్నారు. పరీక్ష నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలు జరగకూడదనే ఇన్నే జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా 30 లక్షల మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. ఇప్పటి వరకు 26 నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు.