AEE అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TSPSC కీలక నిర్ణయం!

by Satheesh |
AEE అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. TSPSC కీలక నిర్ణయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌) నియామక పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్పీఎస్సీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. మే 21వ తేదీన ఏఈఈ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధతిలో ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని గ‌తంలో బోర్డు ప్రక‌టించింది.

అయితే ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చర్, మెకానిక‌ల్ పోస్టుల‌తో పాటు సివిల్ పోస్టుల‌కు కూడా ఆన్‌లైన్‌లో రాత‌ప‌రీక్ష నిర్వహించాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది. వచ్చే నెల 21, 22 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. తుది స్కోరు ఖరారులో నార్మలైజేషన్‌ పద్ధతిని పాటించాలని టీఎస్‌పీఎస్సీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ఈ ఏడాది జనవరి 22 వ తేదీన నిర్వహించిన ఏఈఈ పరీక్షను పేపర్‌ లీకేజీ కారణంగా కమిషన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. 1,540 పోస్టులకు 44,352 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed