TSPSC : ఏఎంవీఐ హాల్ టికెట్లు రిలీజ్

by Rajesh |
TSPSC : ఏఎంవీఐ హాల్ టికెట్లు రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ (ఏఎంవీఐ) పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 113 ఏఎంవీఐ పోస్టుల భర్తీ నిమిత్తం ఈ నెల 28న జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్‌పీఎస్సీ బుధవారం నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు https://www.tspsc. gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. నిజానికి ఈ పరీక్ష ఏప్రిల్ 23న జరగాల్సి ఉండగా టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో ఈ నెల 28కి వాయిదా పడింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరగుతాయని అధికారులు వివరించారు. ప్రాక్టీస్ కోసం వెబ్‌సైట్ లో మాక్ టెస్ట్ లింకును కూడా అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

Also Read..

ఆరు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు

Next Story

Most Viewed