కానిస్టేబుల్ ప్రిలిమినరీలో తప్పుడు ప్రశ్నలు.. TSLPRB చైర్మన్ క్లారిటీ

by GSrikanth |
కానిస్టేబుల్ ప్రిలిమినరీలో తప్పుడు ప్రశ్నలు.. TSLPRB చైర్మన్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో 13 ప్రశ్నలు తప్పులు వచ్చాయంటూ వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన రిక్రూట్‌మెంట్ బోర్డు స్పందించింది. తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తప్పులు వచ్చాయంటూ వస్తోన్న వార్తలను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు ఖండించారు. త్వరలోనే పోలీస్ వెబ్‌సైట్‌లో అధికారిక 'కీ' విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎలాంటి అనుమానాలు ఉన్నా నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. అప్పటివరకు అభ్యర్థులు ఆందోళన చెందవద్దని TSLPRB చైర్మన్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed