- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Law Set: రెండవ , చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ -2023 ఎల్‌ఎల్‌ఎం, ఎల్ఎల్‌బీ మూడు, ఐదు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి రెండవ, చివరి దశ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూలును శుక్రవారం టీఎస్ లాసెట్ 2023 కన్వీనర్ ప్రొ. పి. రమేష్ బాబు వెల్లడించారు.
‘2023-24 విద్య సంవత్సరానికి గాను తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో లా కోర్సులో చేరేందుకు అడ్మిషన్‌లు ఈ ప్రక్రియ ద్వారా చేపడతారు. మొదటి దశలో సర్టిఫికెట్‌లు అప్లోడ్ చేయని అభ్యర్థులు సహితం ఈ రెండవ , చివరి దశ కౌన్సిలింగ్‌లో అప్లై చేసుకోవచ్చు. రెండవ దశలో రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం అలాగే సర్టిఫికెట్స్ , ఆన్‌లైన్ చెల్లింపుతో పాటు గైడ్‌లైన్స్ ప్రకారం ధృవీకరణ కోసం సర్టిఫికెట్ల స్కాన్ చేసిన కాపీలను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు అప్‌లోడ్ చేయాలి. సర్టిఫికెట్‌లను పరిశీలించిన అనంతరం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఏదైనా సవరణలు ఉంటే ఈ-మెయిల్ ద్వారా ఈ నెల 14వ తేదీన తెలియపరుస్తారు. రెండవ దశ వెబ్ ప్రక్రియను ఈ నెల 14 నుంచి 16 వరకు అమలు చేయనున్నారు 19వ తేదీన తాత్కాలికంగా ఎంపిక చేయబడిన అభ్యర్థుల జాబితా కళాశాలల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ట్యూషన్ ఫీజు చెల్లింపు , చలాన్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ చేసేందుకు 20 నుంచి 23 వరకు అవకాశం కల్పించారు.’ టీఎస్ లా సెట్ 2023 కన్వీనర్ ప్రొ. పి. రమేష్ బాబు పేర్కొన్నారు.