TS Govt.: హెల్త్ ‘ఆపరేషన్’..! జిల్లాల్లో ఇక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్

by Shiva |   ( Updated:2024-09-02 15:26:28.0  )
TS Govt.: హెల్త్ ‘ఆపరేషన్’..! జిల్లాల్లో ఇక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశాలతో వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ రెడీ అయ్యారు. అన్ని జిల్లాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తీవ్రంగా ఉన్న ఏరియాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను సిద్ధం చేశారు. దీంతో పాటు పునరావాస కేంద్రాల్లో క్యాంపులు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ రెడీ అయింది. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో వచ్చినోళ్లకు వెంటనే టెస్టులు నిర్వహించనున్నారు. వీరికి సాధారణ పబ్లిక్‌తో కలిసేందుకు వీలు లేకుండా పునరావాస కేంద్రాల్లోనే ప్రత్యేకంగా షెల్టర్స్ ఇవ్వనున్నారు.

ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు

మంత్రి ఆదేశాలలో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. కోఠి పబ్లిక్ హెల్త్ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ సెల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రాంతాల్లోని వైద్య క్యాంపుల పరిస్థితి, బాధితులకు అందుతున్న సేవలను మానిటర్ చేయనున్నారు. గర్భిణుల కోసం ప్రభుత్వ హాస్టళ్లు, కాలేజీలను వినియోగించనున్నారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్(ఈడీడీ) దగ్గరగా ఉన్న గర్భిణులను ముందే ఆయా కేంద్రాలకు తరలించనున్నారు.

అప్రమత్తంగా ఉండాలే: హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ

వరదల నేపథ్యంలో ప్రబలే వ్యాధులను అరికట్టేందుకు వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నది. ప్రజలెవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దగ్గు, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ వంటి లక్షణాలు ఉన్నోళ్లంతా పునరావాస కేంద్రాలు, స్థానికంగా ఉండే పీహెచ్‌సీల్లో టెస్టులు చేయించుకోవాలి. గ్యాస్ట్రో సమస్యలు బారిన పడకుండా గోరువేచ్చని నీరు, వేడి ఆహారమే తీసుకోవాలి. ఎలాంటి ఎమర్జెన్సీకైనా 108ను సంప్రదించొచ్చు. కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షణ కొనసాగతుంది. ఆఫీసర్లు, హెచ్‌వోడీలు, జిల్లా అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ప్రభుత్వం తరఫున ఆదేశాలిచ్చినం.

Advertisement

Next Story

Most Viewed