- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Elections : పోలీసులకు డీజీపీ అంజనీకుమార్ కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇక, ఓట్ల లెక్కింపు సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. శనివారం సీపీలు, ఆయా జిల్లాల ఎస్పీలతో డీజీపీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా పెట్టాలని సూచించారు. చివరి రౌండ్ లో ఉత్కంఠ ఉండే ఛాన్స్ ఉంటుందని.. ఆ సమయంలో మరింత అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రజలను గుమిగూడకుండా చూడాలన్నారు. అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతీకార దాడులు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. అభ్యర్థులు ఎవరు గెలుపొందిన సహకరించేలా సమన్వయం చేసుకోవాలన్నారు. రెండు రోజు మరింత అలర్ట్ గా ఉండాలని.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సీపీలు, ఎస్పీలను డీజీపీ ఆదేశించారు.