- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్‌ఆర్‌ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుది దశకు చేరుకున్న ఎంసెట్ కౌన్సెలింగ్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ తుది దశకు చేరుకుంది. బుధవారం (ఆగస్టు 9) కన్వినర్ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరిగింది. మొత్తం 19 వేల సీట్లను వివిధ బ్రాంచులకు కేటాయించాల్సి ఉంది. కన్వినర్ కోటా కింద 82,666 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు రిపోర్టు చేయకపోవడం వల్ల మిగిలిపోయిన 18 వేల సీట్లతో కలిపి మొత్తం 30,013 సీట్లను రెండో విడతలో కేటాయించారు. ఐతే రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. రెండో విడతలో సీట్లు పొందినా 7 వేల మంది వరకూ విద్యార్ధులు ఆయా కాలేజీల్లో చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 19 వేల వరకూ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
తాజాగా జరిగిన తుది విడతలో సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో స్వయంగా రిపోర్టుచేయాలి లేదంటే సీటు రద్ధవుతుంది. ఇక తుది విడతలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ జరగనుంది. జోసా (ది జాయింట్ సీట్ ఆలోకేషన్ అథారిటీ ) కౌన్సెలింగ్‌లో ఎన్‌ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. వీటిల్లో సీట్లు పొందని వారికి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. స్పెషల్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆగస్టు 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందినవారు ఆగస్టు 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేయాలి. ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వేరొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీటు మార్పించు కోవాలి.
అప్పటికే వేరే కాలేజీలో సీటు వచ్చి ఉంటే అక్కడ టీసీ, సర్టిఫికెట్లను తీసుకుని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో ఈ నెల 25లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ప్రత్యేక కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాలను ప్రైవేటు కాలేజీలకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది. వీటిల్లో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ సిఫార్సులకు అలాగే జేఈఈ, ఎంసెట్ ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.