TS Assembly : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సమర్ధించిన బీజేపీ

by Sathputhe Rajesh |
TS Assembly : అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సమర్ధించిన బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం కాంగ్రెస్ సర్కారు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. సివిల్ కోర్టు సవరణ బిల్లును సమర్ధిస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలను చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని.. అద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరం అన్నారు. నియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవన్నారు. కేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలన్నారు. కోర్టుల అంశంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దాలన్నారు. తెలంగాణ సంక్షిప్త పదముల (TS ను TG) మార్పు బిల్లును బీజేపీ సమర్ధించింది.

Advertisement

Next Story

Most Viewed