పురోహితుడిని చంపుతానని బెదిరించిన TRS సర్పంచ్

by GSrikanth |
పురోహితుడిని చంపుతానని బెదిరించిన TRS సర్పంచ్
X

దిశ, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ చల్ల నారాయణ తనను చంపుతానని బెదిరించాడని అదే గ్రామానికి చెందిన పురోహితుడు చెరుకు విఠల్ శర్మ ఆదివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా బాధిత పురోహితుడు మాట్లాడుతూ... ఆదివారం రాత్రి గ్రామ సర్పంచ్ చల్ల నారాయణ తనకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని వాపోయారు. తనను గ్రామం నుండి వెలివేస్తానని మాది అధికార పార్టీ అంటూ, తాను చెప్పినట్లు వినాలని లేకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచ్ నుండి తనకు ప్రాణ భయం ఉందని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మొరపెట్టుకుంటున్నాడు.

Advertisement

Next Story