- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నిలువరించండి.. మునుగోడులోకి 'బండి'ని ఎంటర్ కానివ్వొద్దు'
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలను, ఓటర్లను విద్వేష ప్రసంగాలతో రెచ్చగొడుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాలుపంచుకోకుండా నిలువరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఆ నియోజకవర్గంలోని తిరుమాండ్లపల్లిలో రోడ్‌షోలో బండి సంజయ్ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, టీఆర్ఎస్ పార్టీ నోట్లు ఇస్తే వాటిని తీసుకోవాలని, కానీ ఓటును మాత్రం బీజేపీకే వేయాలంటూ మాట్లాడారని, ఇది ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఆ కంప్లైంట్‌లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ పేర్కొన్నారు. ఓటర్లను అవినీతికి పాల్పడేలా సంజయ్ ప్రోత్సహిస్తున్నారని, బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా అనర్హుడిని చేయాలని కోరారు. టీఆర్ఎస్‌పై బురద జల్లే తీరులో 'దండుపాళ్యం బ్యాచ్' అంటూ ప్రతిష్టకు భంగం కలిగించే పదజాలాన్ని వాడుతున్నారని గుర్తుచేశారు.
ఎలక్షన్ కోడ్ ప్రకారం ఎన్నికల ప్రచారంలో దేవుడి పేరును ప్రస్తావించకూడదని, కానీ బండి సంజయ్ మాత్రం బీజేపీ కార్యకర్తలను రాముని సేవకులుగా, టీఆర్ఎస్ కార్యకర్తలను రాక్షసులుగా అభివర్ణించారని, దీన్ని కమిషన్ సీరియస్‌గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించడం సమంజసం కాదని గుర్తుచేశారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్‌దేనని గుర్తుచేశారు. తక్షణం బండి సంజయ్‌ను ప్రచారం నుంచి తప్పించాలని, స్టార్ క్యాంపెయినర్ హోదాను తొలగించాలని, పోలింగ్ ముగిసే వరకు మునుగోడులో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించారని, ఇప్పటివరకు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేయడంలేదని, బాధ్యతలను పట్టించుకోవడంలేదనే అపవాదు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండేతో టీఆర్ఎస్ ప్రతినిధిగా మంగళవారం భేటీ అయిన రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ రోడ్డురోలర్ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసిన సందర్భంగా బండి సంజయ్ ప్రసంగం అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే సమయంలో పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్, దేవీప్రసాద్ కూడా రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సత్యవాణికి మెమొరాండం అందజేశారు. రోడ్డురోలర్ గుర్తుపై ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, 2011లో టీఆర్ఎస్ చేసిన అభ్యంతరం కారణంగానే రోడ్డురోలర్ గుర్తును తొలగించిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్‌కు ఉన్న కామన్ సింబల్ కారు గుర్తును రోడ్డు రోలర్ గుర్తు పోలి ఉన్నదని, సారూప్యత ఉన్నదని వివరించారు. ఓటర్లలో కన్‌ప్యూజన్ ఉంటుందని, అందువల్లనే తొలగించాలని కోరుతున్నామని వివరించారు.