- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెజరీ బిల్లులు రిజెక్ట్.. టీఆర్టీఎఫ్నేతల ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జీతాలు ఇతర బిల్లుల చెల్లింపులను ఇన్ని రోజులు ఈ కుబేర్‌లో పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు ఒక్కసారిగా రిజెక్ట్ చేయడంపై తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని పున:సమీక్షించాలని వారు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వైద్య, కుటుంబ ఖర్చులు, పిల్లల విద్యాభ్యాసం, వివాహ ఖర్చులు, గృహ నిర్మాణ సంబంధించినటువంటి అవసరాల కోసం సమర్పించిన బిల్లులన్నీ ఇలా ఏకమొత్తంగా రిజెక్ట్ చేయడం, తిరిగి నూతన టోకెన్లు జెనరేట్ చేసుకోవాలని తెలపడం ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదని వారు పేర్కొన్నారు.
జీతాలు ఇప్పటికే ఆలస్యంగా ఇస్తున్నారని, బిల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయని, నూతన పీఆర్సీ ప్రకటించాల్సిన సమయం దాటిపోయినా ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత పీఆర్సీ, ఏరియర్స్ మూడు నెలలు మాత్రమే చెల్లించి మిగతావి ఈ కుబేర లో పెండింగ్ లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి బిల్లులన్నీ క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.