MLC కవిత జగిత్యాల పర్యటనలో తీవ్ర విషాదం..

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-01 07:22:28.0  )
MLC కవిత జగిత్యాల పర్యటనలో తీవ్ర విషాదం..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్సీ కవిత పర్యటనలో విషాదం నెలకుంది. ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా కొత్త బస్ స్టాండ్ చౌరస్తా వద్ద కవిత కోసం ఎదురుచూస్తూ స్వాగతం పలికేందుకు నృత్యాలు చేస్తూ హుషారుగా ఉన్న తరుణంలో అధికార పార్టీ కౌన్సిలర్ బండారి రజనీ భర్త బండారి నరేందర్ నృత్యం చేస్తూ ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలగా గమనించిన తోటి నాయకులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే నరేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందరితో కలివిడిగా ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండే వ్యక్తి ఉన్నట్టు ఉండి మరణించడంతో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఆత్మీయ సమ్మేళనంలో సంతాపం ప్రకటించిన తర్వాత వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.

ఇవి కూడా చదవండి: జగిత్యాలలో ఫ్లెక్సీ వార్! ఎమ్మెల్సీ కవిత పర్యటన వేళ టెన్షన్.. టెన్షన్

Advertisement

Next Story