ఎంపీ అభ్యర్థులపై ట్రాఫిక్ చలాన్లు.. చాలా మందివి పెండింగ్‌లోనే?

by Ramesh N |
ఎంపీ అభ్యర్థులపై ట్రాఫిక్ చలాన్లు.. చాలా మందివి పెండింగ్‌లోనే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సామాన్యులే కాకుండా ప్రజలకు మంచి చెడులు చెప్పే రాజకీయ నాయకులు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు పార్టీల ఎంపీ అభ్యర్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తాజాగా చర్చానీయాంశంగా మారింది. అయితే, ఎంపీ అభ్యర్థులు పోల్ అఫిడవిట్‌లను సమర్పించే ముందు అన్ని బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. వీరిలో కొంత మంది చలాన్లు చెల్లించగా.. మరికొందరివి పెండింగ్ ఉన్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినప్పుడు తాము డ్రైవింగ్ చేయలేదని ఎంపీలు వాదించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వారికి డ్రైవర్స్ ఉంటారు.

ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 2019 నుంచి 2024 వరకు మొత్తం రూ. 6.210లు పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలిసింది. మెదక్ కాంగ్రెస్ ఎంపీ క్యాండెట్ నీలం మధు ప్రయాణించే కారుకు రూ.3,305 కట్టగా.. మరికొంత కట్టాల్సి ఉందని సమాచారం. జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ గత ఏడాది డిసెంబర్ వరకు ఉన్న రూ.3,105ల చలాన్లు కలిగి ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కారుపై మొత్తం రూ. 3105 చలాన్లు కలిగి ఉన్నారు. అతనికి చెందిన మరో కారుకు ₹1,035 బకాయిలు ఉన్నాయి.

బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు

పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఫిబ్రవరి 2019 నుంచి రూ. 2,070 చలాన్లు పెండింగ్‌లో ఉన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టీ పద్మారావు ఏప్రిల్ 2024 నుంచి రూ. 1,035 చలాన్‌లు కలిగి ఉన్నారు. నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి కి రూ. 200 పెండింగ్ చలానా ఉంది. మరో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ రూ. 470 చలాన్ పెండింగ్‌లో ఉందని సమాచారం. కాగా, వీరందరిపై కూడా ఎక్కువగా సిగ్నల్ జంపింగ్, అతివేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసినందుకు వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్లు పంపించారు.

Advertisement

Next Story

Most Viewed