ORRను కేసీఆర్, కేటీఆర్ ముంబై కంపెనీకి తెగనమ్మారు: సర్కార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

by Satheesh |   ( Updated:2023-05-24 14:54:08.0  )
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, తెలంగాణ బ్యూరో: అక్రమ సొమ్ముతో కేటీఆర్​ పెట్టుబడులు పెడుతున్నారని టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలు చేస్తూ కేటీఆర్​సొంత పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ఓఆర్ఆర్​ స్కామ్‌లో వచ్చిన నిధులన్నీ విదేశాల్లో పెట్టుబడులకు ఉపయోగిస్తున్నారన్నారు. వాస్తవానికి ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోనే 10 శాతం అడ్వాన్స్‌డ్‌గా చెల్లించాల్సి ఉంటుందని, దాని ప్రకారం ఐఆర్బీ సంస్థ రూ.7,388 కోట్లలో రూ. 738 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

అయితే ఈ10 శాతాన్ని ఇప్పటి వరకు చెల్లించకుండా ఇంకా సమయం అడగడం విచిత్రంగా ఉన్నదన్నారు. పైగా ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థపై చర్యలు తీసుకోకుండా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. నిబంధనల మేరకు 10 శాతం నిధులు కూడా చెల్లించలేని ఐఆర్‌బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు అని రేవంత్ ప్రశ్నించారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్‌ను ముంబైకి చెందిన ఐఆర్బీ డెవలప్ మెంట్ సంస్థకు కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అప్పటి సీఎస్ సోమేష్ కుమార్​ఆధ్వర్యంలో తెగనమ్మారని ధ్వజమెత్తారు. ​

లక్ష కోట్లు ప్రాజెక్టు రూ. 7 వేలకేనా..?

కేటీఆర్, అరవింద్, సోమేష్​కుమార్‌ల చొరవతో లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ప్రాజెక్టును ఐఆర్బీ సంస్థ కేవలం రూ.7 వేల కోట్లకే దక్కించుకున్నదన్నారు. సంస్థ ఫైనాన్షియల్ స్టేటస్, ఆస్తుల విలువను చూసిన తర్వాతే ఐఆర్బీ సంస్థకు టెండర్ కట్టబెట్టామని కేటీఆర్, కేసీఆర్‌లు గతంలో గొప్పగా చెప్పారని.. కానీ ఇప్పుడు హడావుడిగా వాయిదాల పద్దతిలో చెల్లించేలా ఐఆర్బీ సంస్థకు వెసులుబాటు ఇవ్వడం వెనక ఆంతర్యామేమిటని? ప్రశ్నించారు.

వాస్తవానికి ఓఆర్ఆర్‌కు వందలా ఎకరాలున్నాయని, వాటిల్లో కమర్షియల్ యాక్టివిటీ మొదలుపెడితే వేలాది కోట్ల రూపాయాల ఆదాయం సర్కార్‌కు వస్తుందన్నారు. మరోవైపు హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఇంత తొందరగా ఓఆర్ఆర్‌ను అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read..

CM కేసీఆర్ ​టైమ్ అయిపోయింది.. మరో ఐదు నెలలే పవర్: మాణిక్ రావు ఠాక్రే

Advertisement

Next Story

Most Viewed