- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ గెలవకపోతే వాళ్లంతా నక్సలైట్లు అవుతారు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని, నమ్మించి మోసం చేసిన ఘనత ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానిదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు పోరాడి అలసిపోయారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఉద్యోగాలు రాని యువత అడవిలో అన్నలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం స్టేషన్ ఘన్ పూర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. నిరుద్యోగ యువత అడవిలో అన్నలుగా మారడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వలేదని ప్రస్తుతం ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ లేదని అన్నారు. కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు బంద్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు సైతం భరోసా ఇస్తామని.. ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని.. మేము అధికారంలోకి వస్తే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతే 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే ఇళ్లకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.
రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. మంత్రి వర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు. స్టేషన్ ఘన్ పూర్‌కు వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఈ రెండు పనులు చేయించే బాధ్యత నాదేనన్నారు. రాష్ట్రంలోని సర్పంచ్‌లంతా ఆలోచన చేయాలని.. సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపడితే వాటి బిల్లులు చెల్లించాల్సిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సర్పంచులను ఖాళీ బీర్ సీసాలు అమ్ముకోవాలని చెబుతున్నాడన్నారు.