- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పని చేయలేదని తడి బట్టలతో ప్రమాణం చేస్తా.. ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బులు తీకున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈటల వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించిన రేవంత్ రెడ్డి.. రేపు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. శుక్రవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్.. మునుగోడు ఎన్నికల్లో రూ.25 కోట్లు కాంగ్రెస్‌కు కేసీఆర్ ఇచ్చారని రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేననన్నారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్ధిక సాయం చేశారని వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటల మాట్లాడటం సమంజసం కాదన్నారు.
నాపై చేసిన ఆరోపణలను ఈటల రాజేందర్ 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్‌లో దేవుడిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. నాపై ఆరోపణలను ఈటల నిరూపించడానికి సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిపై ఈటలకు నమ్మకం లేకుంటే.. ఏ ఆలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణానికి తాను సిద్ధంంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాల కోసం ఈటల దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.