- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్ 9న కాంగ్రెస్ తొలి సంతకం దానిపైనే: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుంది.. అదే రోజు ఉదయం 10.30 గంటలకు ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ తొలి సంతకం చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. సోమవారం వికారాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్‌కు కృష్ణా జలాలు రాకపోవడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ తెచ్చేందుకు జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.
కానీ వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్ రాకపోవడానికి సీఎం కేసీఆర్ కారణమని మండిపడ్డారు. రాజకీయాల్లో ఈ ప్రాంత ప్రజలకు తెలియని రౌడీయిజాన్ని తెచ్చింది కేసీఆరే అని నిప్పులు చెరిగారు. ఇప్పుడు తెలంగాణ దశ, దిశ మార్చే సమయం వచ్చిందన్నారు. నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోయారు.. నిధులు కృష్ణారెడ్డి తీసుకుపోయారని ఆరోపించారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలు తీస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న యువతిపై కేటీఆర్, పోలీసులు అభాండాలు వేశారని నిప్పులు చెరిగారు.