- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TPCC Chief: గీత దాటిన నేతను ఏం చేయాలో మాకు తెలుసు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. తరచూ పార్టీకి, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటంతో నేతలతో పాటు కేడర్‌లో కూడా కన్‌ఫ్యూజన్ నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన(Caste Census) సర్వేను తగులబెట్టడంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. దీంతో ఆయనపై చర్యలకు సిద్ధమైంది. తాజాగా.. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. శాస్త్రీయపద్ధతిలో కులగణన సర్వే జరిగింది. 56 శాతంపైగా బీసీలు ఉన్నారని సర్వేలో తేలింది. బీసీ సంఘాలను BRS నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ నేతల ట్రాప్‌లో బీసీ సంఘాలు పడొద్దని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఎవరైనాసరే క్రమశిక్షణ తప్పితే తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పార్టీలైన్ దాటి మాట్లాడిన వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా క్రమశిక్షణకు లోబడే ఉండాలన్నారు. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో ఆ కమిటీ చూసుకుంటుంది అని వెల్లడించారు.
గురువారం కాంగ్రెస్ పార్టీ కుటుంబ మీటింగ్ ఉందని.. అందులో అన్నీ మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటామని అన్నారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గకరణతో బీసీ, ఎస్సీల దశాబ్దాల కల సాకారమైందని అన్నారు. సీఎం రేవంత్(CM Revanth Reddy), మంత్రుల చొరవతో బీసీ కులగణన, ఎస్సీ వర్గకరణ మోక్షం లభించిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీసీ కులగణన జరిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. బిహార్ లాంటి రాష్ట్రాలు కులగణన చేపట్టినా కార్యరూపం దాల్చలేదని గుర్తుచేశారు. కులగణన సర్వేపై ప్రతిపక్షాలు విమర్శలకు బదులు సలహాలు, సూచనలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
Also Read..
MLC Teenmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు!