- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెదిరించి జేపీఎస్‌ల సమ్మెను విరామయింపజేశారు!
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రితో సంప్రదింపులు జరిగిన తర్వాత పంచాయతీ సెక్రటరీలు సమ్మెను విరమింపజేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆదివారం స్పందించారు. సమ్మె విరమింప చేస్తున్నట్టు వచ్చిన ప్రకటన విస్మాయాన్ని కలిగించేదిగా ఉందన్నారు. సాధారణంగా ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలతో చర్చలు జరిపితే ఆ చర్చల సారాంశాన్ని ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తారు లేకపోతే లిఖితపూర్వకమైన స్టేట్మెంట్ అయినా ప్రభుత్వం జారీ చేస్తుందన్నారు. కానీ అటువంటిది ఏది రాలేదన్నారు. స్టేట్మెంట్ రాకపోవడం వల్ల ఈ సమస్య పట్ల గతంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర అన్యాయం జరిగిందని విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు. బహుశా బెదిరించి సమ్మె విరమింపజేసి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. నిజంగా న్యాయసమ్మతంగా సమ్మె విరమింప చేస్తే సంప్రదాయంగా ఒక ప్రకటన వచ్చేది అన్నారు.
మూడేళ్ల తర్వాత రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయమని వారు చాలాసార్లు ప్రభుత్వాన్ని అడిగారు, ప్రభుత్వం మరో సంవత్సరం ప్రొబిషన్ను ఎక్స్టెండ్ చేస్తూ జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. పంచాయతీ కార్యదర్శులు రెగ్యులర్ చేయమనడానికి కారణం విపరీతమైన వ్యక్తి వారు చేయాల్సి వస్తున్నదన్నారు. సెలవుల సౌకర్యం, మెటర్నటీ లీవ్స్ లేకుండా విపరీతమైన వేధింపునకు గురవుతున్నారని ఆ వేధింపులకు పరిష్కారంగా సమ్మెకు దిగారని గుర్తు చేశారు. సమ్మెను ఉపసంహరించుకోకపోతే ఉద్యోగాల్లోంచి తీసేస్తామని బెదిరించిందని ఉంటారని ఆరోపించారు. అందుకే వారు సమ్మె విరమింప చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి న్యాయమైన సమస్యలకు పరిష్కారంగా ప్రకటన మాత్రం ఏమీ విడుదల కాలేదన్నారు. వెంటనే సమస్య పరిష్కారానికై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ జెపిఎస్ లతో చర్చలు జరపి వారికి న్యాయం చేయాలన్నారు. ఇలాంటి అప్రజా స్వామికమైన అన్యాయమైన ధోరణి మంచిది కాదని ఇది సమాజానికి నష్టమని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదుగుదలకు ఆటంకం అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సోయిలోకి వచ్చి వారి సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Also Read..