దొరకని వారు 'వైట్ పేపర్' కాదు.. లంచగొడిలపై ఐపీఎస్ సుమతి సెన్సేషనల్ ట్వీట్

by Prasad Jukanti |
దొరకని వారు వైట్ పేపర్  కాదు.. లంచగొడిలపై ఐపీఎస్ సుమతి సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో అవినీతి అధికారుల బాగోతాలు బయటపడుతున్నాయి. ఏసీబీ నిర్వహిస్తున్న రెయిడ్స్ లో అడ్డంగా బుక్ అవుతున్నారు. రాష్ట్రంలో ఓ కుదుపు కుదిపేస్తున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి కేసు నడుస్తుండగానే తాజాగా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి లంచావతారం కేసు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. వీటితో పాటు నిత్యం ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్న ఘటనలు ఇంకా అనేకం ఉన్నాయి. లంచగొండి ఆఫీసర్లపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రభుత్వంలోని రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్‌ శాఖలో కూడా అవినీతి ఓ రేంజ్‌లో ఉందని ఏసీబీ డీజీ, సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్ గతంలో చేసిన ట్వీట్ వైరల్ కాగా కాగా తాజాగా మరో సీనియర్ మహిళా ఐఫీఎస్ ఆఫీసర్ సుమతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిక్కని వారు వైట్ పేపర్ కాదు:

జగజ్యోతి వ్యవహారంపై ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి బుధవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. 'నిఘా ఎప్పటికీ ఉంటుంది.. చిక్కిన వారిపై చట్టం తన పని చేసుకుపోతుంది. చిక్కని వారు 'వైట్ పేపర్' అని కాదు. వారికి ఇంకా టైమ్ రాలేదేమో అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే నిజాయితీ అనేది విశ్వవాప్త విలువ అని ఒక సమాజాంగా ఇటవంటి సంఘటనలు మనకు పౌరులు, తల్లిదండ్రులు, పిల్లలు, యువకులు, సీనియర్ సిటిజన్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మొదలైన వాటిని గుర్తు చేస్తాయన్నారు. మనమంతక మన స్వంత పాత్రలలో మాటలు, చర్యలలో నిజాయితీని పెంపొందించడానికి ప్రయత్నిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమతి చేసిన ఈ ట్వీట్ అధికార వర్గాల్లో చర్చగా మారింది. అయితే లంచగొండి ఆఫీసర్లపై గతంలో సీవీ ఆనంద్ చేసిన ట్వీట్ పై తాజాగా సుమతి చేసిన ట్వీట్ పై నెటిజన్లు సైతం రియాక్ట్ అయ్యారు. అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్న వారు చిన్న చితక అధికారులేనని పెద్ద తలకాయలు ఇంకా చాలా మంది ఆయా శాఖల్లో ప్రజలను పట్టి పీడిస్తున్నారనే కామెంట్స్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన వారిపై నామమాత్రపు చర్యలతో వదిలేస్తున్నారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story