- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డబ్బులు దాచేందుకు ఇదే సేఫ్.. వృద్ధురాలి తెలివికి పోలీసుల మైండ్ బ్లాంక్
దిశ, వెబ్‌డెస్క్: 'జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి' అని ఊరికే అనలేదు పెద్దలు. ఎవరైనా తాము సంపాదించి వెనకేసుకున్న డబ్బును ఏ బ్యాంకులోనో, పోస్టాఫీస్‌లోనో దాచుకుంటారు. లేకపోతే నమ్మకస్తులైన ఇరుగు పొరుగు వారికి వడ్డీకి ఇచ్చి ఆ మొత్తాన్ని రెట్టింపు చేసుకోవాలని చూస్తారు. కానీ, తాజాగా మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటన చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా జగ్గుతండాకు చెందిన ఓ వృద్ధురాలు పొలం, కూలీ పనులకు వెళ్లి రూపాయి రూపాయి జమ చేసి రూ.2.5 లక్షల వరకు కూడబెట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అంత డబ్బు ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలియక ఆ వృద్ధురాలు కలవరపాటుకు గురైంది.
ఎవరైనా దొంగలు తన ఇంట్లోకి చొరబడి డబ్బు దొచుకెళ్తారేమోనని భయపడింది. అనుకుందే తడవుగా ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఓ గుంత తవ్వి అందులో డబ్బును కొన్ని రోజుల క్రితం పాతిపెట్టింది. ఇటీవలే తనకు డబ్బు అవసరం అవ్వగా.. తాను డబ్బు పాతిపెట్టిన చోట గుంతను తవ్వి చూడగా.. అందులో డబ్బు కనిపించలేదు. దీంతో వృద్ధురాలు కంగారుపడి అసలు విషయాన్ని స్థానికులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వృద్ధురాలి ఇంటికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాల్లో పలు చోట్ల వెతికి పాతిపెట్టిన డబ్బును వెలికి తీసి ఆ వృద్ధురాలికి అందజేయడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. కాగా, డబ్బులెవరైనా బ్యాంకులో దాచిపెడతారు, కానీ ఇలా భూమిలో దాచడం ఏంటని వృద్ధురాలు చేసిన పని చూసి స్థానికులు, పోలీసులు అవాక్కయ్యారు.