రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి లేదు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్

by Ramesh N |
రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి లేదు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదనిబ బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని వాళ్ళే చెప్తున్నారని, మాటలు గొప్పగా ఉన్నాయి, కానీ చేతలు లేవన్నారు. ఆదివారం గుండ్లపోచంపల్లిలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్న ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. చెరువుల చుట్టూ ఇల్లు కట్టుకున్న వాళ్లు 99 శాతం మంది అక్రమాలు కావని, పట్టాభూముల్లో ప్రభుత్వ అనుమతులతో కట్టుకున్నవని వెల్లడించారు. దొంగల్లాగా ఆ ఆశల సౌధాలను కూలగొట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించానని అన్నారు. మొత్తానికి ప్రజల కోపాగ్రానికి దిగివచ్చి కూలగొట్టం అని నంగనాచి మాటలైతే మాటలాడుతున్నారని విమర్శించారు.

మరోవైపు ఈ రెండు నెలల కాలంలో ఆరు గుళ్ళు ధ్వంసం చేశారని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్ళు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని అన్నారు. ప్రధాని మోడీ టెర్రరిజం మీద, ఉన్మాదుల మీద ఉక్కుపాదం పెట్టారని అన్నారు. ఈ ఉన్మాదులను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం అని హెచ్చరించారన్నారు. ఉన్మాదులను పెంచి పోషించడం పాముకు పాలు పోసి పెంచడమేనని అన్నారు. ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోతే కేంద్రం ఇన్వాల్వ్ కావలసి వస్తుందన్నారు. అదేవిధంగా మేడ్చల్, షామీర్ పేట వరకు మెట్రో తీసుకురావాలని ఇప్పటికే పార్లమెంట్‌లో మాట్లాడానని గుర్తుచేశారు. ఆ ప్రయత్నం కొనసాగిస్తానని అన్నారు. ఇదిలా ఉండగా ముత్యాలమ్మ దేవాలయం వద్ద గాయపడిన సాయి కుమార్ గౌడ్‌ను ఓల్డ్ బోయినపల్లిలో ఈటల రాజేందర్ పరామర్శించారు.

Advertisement

Next Story

Most Viewed