Aadi Srinivas : అబద్దాలలో హరీష్ రావును మించిన వారు లేరు : ఆది శ్రీనివాస్

by Y. Venkata Narasimha Reddy |
Aadi Srinivas : అబద్దాలలో హరీష్ రావును మించిన వారు లేరు : ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్ : అబద్దాలు ఆడటంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ను మించిన వారు ఎవరూ లేరని ప్రభుత్వ విప్(Government Whip) ఆది శ్రీనివాస్ (Aadi Srinivas)విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఓ రైతుకు వచ్చిన రైతు భరోసా(Rythu Bharosa)డబ్బుల వివాదంపై హరీష్ రావు చేసిన ట్వీట్ కు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వంపై మూడు నెలల నుండి విమర్శలు చేస్తున్నారన్నారు.

బావ, బామ్మర్దులు బీఆర్ఎస్ లో ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలకు కల్లబోల్లి కబుర్లు చెప్తున్నారని..ప్రభుత్వంపై మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా, బట్ట కాల్చి ప్రభుత్వంపై వేసే విధంగా హరీష్ రావు, కేటీఆర్, ఈమధ్య కవిత కూడా వీళ్లకు తోడైందని మండిపడ్డారు. గత పది సంవత్సరాల మీ పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మార్చారన్నారు. రైతులకు రైతు భరోసా అందిస్తే చూసి ఓర్వలేక పోతున్నారని.. మీ హయాంలో రైతులకు 40 కిలోల సంచికి 44 కిలోలు తూకం వేసి రైతులను నిలువున ముంచారన్నారు. రైతు రుణమాఫీపై రైతులను మోసం చేశారని, రైతులకు రైతు భరోసా అందిస్తూ మొన్నటి రోజున ఎకరం, రెండు ఎకరాలు.. ఇలా వరుసగా రైతులకు అందిస్తే అబద్దాల హరీష్ రావు ఒక దుష్ప్రచారానికి తెరలేపారని దుయ్యబట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన నకీర్తి కనకవ్వ కు రైతు భరోసా విషయంలో 31 గుంటలు ఉంటే కేవలం 1650 రూపాయలు వేశారని హరీష్ రావు అబద్ధాలు చెప్పి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాడని విమర్శించారు. వాస్తవంగా నకీర్తి కనకవ్వ కు 580/బి లో 4 గుంటలు, 943/10 లో 7 గుంటలు మొత్తం 11 గుంటలు ఉంటే దానికి 1650 రూపాయలు వచ్చాయని..కావాలంటే పొత్గల్ లోని వారి బ్యాంకు ఖాతాలో ఒకసారి సరి చూసుకోవచ్చని హితవు పలికారు. ఇప్పుడు హరీష్ రావు ఒకసారి కళ్ళకు కంటి ఆపరేషన్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు.

దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా హరీష్ రావు నిలుస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. హరీష్ రావు అసెంబ్లీలో , బయట కుల గణనపై కూడా ఇలానే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. వారు చేసిన సమగ్ర సర్వేను బయట పెట్టకుండా అటకెక్కించారని..వారు 61 శాతం బీసీలకు ఇచ్చామంటున్నారు తీరా చూస్తే 51 శాతమే ఉందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తప్పుడు విమర్శలకు దిగారని చెప్పుకొచ్చారు.

Next Story