ముఖ్యమంత్రి ప్రకటన ఇవాళ లేనట్లే

by GSrikanth |
ముఖ్యమంత్రి ప్రకటన ఇవాళ లేనట్లే
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం క్యాండిడేట్ ఎంపిక వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇవాళ సాయంత్రం సీఎం ఎవరనేదానిపై క్లారిటీ వస్తుందని అంతా భావించినా ఈ విషయంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ పరిశీలకులను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. దీంతో డీకే శివకుమార్‌తో సహా మరో నలుగురు పరిశీలకులు ఢిల్లీకి బయలుదేరారు. వీరు రేపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందున సీఎం అభ్యర్థి విషయంలో ఎమ్మెల్యేలందరి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకునేందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రచార సమయంలో సీనియర్లు, జూనియర్ల విభేదాలు లేకుండా పార్టీని ముందుకు నడిపించిన అధిష్టానం.. ప్రభుత్వం ఏర్పాటు విషయంలోను ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీగా అన్ని కోణాల్లో విశ్లేషించుకుని ఆ తర్వాతే సీఎం పేరును ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోవైపు అధిష్టానం నుంచి ప్రకటన వచ్చాకే కాంగ్రెస్ నేతలు గవర్నర్ కలవనున్నారు.

Advertisement

Next Story