BREAKING: తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. మరో రెండు స్కీమ్‌లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

by Satheesh |   ( Updated:2024-02-04 16:30:20.0  )
BREAKING: తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. మరో రెండు స్కీమ్‌లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ స్కీమ్‌లకు కేబినెట్ ఆమోదం తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో జరిగిన కేబినెట్ భేటీలో ఈ స్కీమ్‌లకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదం తెలపడంతో త్వరలోనే ఈ రెండు స్కీమ్‌లను ప్రభుత్వం అమలు చేయనుంది.కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఇప్పటికే రెండు స్కీమ్‌లను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 వరకు పెంచింది. తాజాగా ఆరు గ్యారెంటీల్లోని మరో రెండు పథకాల అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

Next Story