బిగ్ బ్రేకింగ్: తెలంగాణ పెండింగ్ బిల్లులు కేసులో కీలక పరిణామం

by Satheesh |   ( Updated:2023-03-21 10:38:18.0  )
బిగ్ బ్రేకింగ్: తెలంగాణ పెండింగ్ బిల్లులు కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పెండింగ్ బిల్లుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ, శాసన మండలి ఆమోదించిన బిల్లులకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై ఆమోదం తెలపకపోవడంతో తెలంగాణ సీఎస్ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదం తెలిపేలా ఆదేశాలివ్వాలని సీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్‌‌పై ఈ నెల 20వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం గవర్నర్‌కు అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.

అయితే గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై సమాధానం చెప్పాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, తెలంగాణ గవర్నర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌గా పరిస్థితులు మారడంతో పెండింగ్ బిల్లుల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా ఈ పెండింగ్ బిల్లుల లొల్లి కేంద్ర ప్రభుత్వానికి చేరడంతో నెక్ట్స్ ఏం జరగబోతోందో ఆసక్తిగా మారింది

Advertisement

Next Story

Most Viewed