- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె విరమించారు. బుధవారం ప్రభుత్వంతో జరిపిన రెండో దఫా చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హామీ మేరకు జూడాలు వెనక్కి తగ్గారు. కాగా, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో వసతి గృహాల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులు, కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జూడాల సమ్మెకు చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం జూడాలతో చర్చలు జరిపింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ జూడాలు సమ్మె విరమించారు. ఉస్మానియా ఆసుపత్రిలో మాత్రం జూడాలు సమ్మె కంటిన్యూ చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి ఉస్మానియా జూడాలతో ఇవాళ చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలీకృతం కావడంతో ఉస్మానియాలోనూ జూడాలు సమ్మెను విరమించారు.