- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రన్నింగ్ లో విరిగిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్డు.. ఆ సయమంలో బస్సులో 38 మంది..
by Kalyani |
X
దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగిపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా కంట్రోల్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రం శివారులో శనివారం జరిగింది. కొల్లాపూర్ డిపోకు చెందిన టీఎస్ 32 జడ్ 0014 బస్సులో 38 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
బస్సు డిపోలో మరమ్మత్తుల పనులు సరిగా చేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రయాణికులు వాపోయారు. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని చెప్తూనే మరమ్మత్తు గురైన బస్సులను రోడ్డుపై నడపడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీనిపై డిపో మేనేజర్ రాజేశ్వర్ మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చిన్న సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story