- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాల్మీకి బోయలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
దిశ, డైనమిక్ బ్యూరో: వాల్మికి బోయలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరిని ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానానికి శుక్రవారం అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం కోసం బోయ హక్కుల పోరాట సమితి, వాల్మీకి బోయ మేధావుల ఫోరం చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వాల్మికి బోయలతో పాటుగా బేదర, కిరాతక, నిషాది, పెద్ద బోయ, బాట్ మదురాలు, చామర్ మదురాలను ఎస్టీలో చేర్చాలని గతంలో కేంద్రానికి లేక రాసినప్పటికీ ఇప్పటి వరకు సమాధానం రాలేదని అందువల్ల మరోసారి లేఖ రాస్తామన్నారు. ఆసిఫాబాద్‌తో పాటు ఆదివాసీ జిల్లాలో నివసిస్తున్న మాదిగలను సైతం ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదనలు పరిశీలిస్తామని సీఎం ప్రకటించారు.