- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'తెలంగాణ యువతను నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్'
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నో ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న యువతకు నిరాశే మిగిలిందని యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ ఆవేదన వ్యక్తంచేశారు. అబద్దాల సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృత్తి ఏమైందని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బడ్జెట్‌లో నిరుద్యోగులకు పైసా కూడా ఇవ్వలేదని సింకారు శివాజీ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం యువత పోరాటం చేసింది.. ఇందుకేనా? అంటూ ప్రశ్నించారు.
సాక్ష్యాత్తు అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని, ఇక రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇది ముమ్మాటికి భావితరాలను వెనెక్కి నెట్టుతున్న ప్రభుత్వమని స్పష్టం చేశారు. నిరుద్యోగ సంఖ్య రోజురోజుకు పెరిగి బారమైతున్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. సరైన సమయంలో ఉద్యోగాలు ఇవ్వని కారణంగానే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య అధిక సంఖ్యలో పెరుగుతుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యా రంగం పైన చిన్న చూపు చూస్తోందన్నారు. విద్యాలయాలలో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాకుండా నిజాలు చెప్పాలని సూచన చేశారు. బడ్జెట్‌లో విద్యారంగానికి, నిరుద్యోగ యువతకు సైతం అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Read More..
వాణిజ్య ప్రకటనల్లో సినిమా హీరోలు చేసే స్టంట్స్‌లా రాష్ట్ర బడ్జెట్: కోదండరామ్