- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటి వెలుగు సెకండ్ ఫేజ్ క్లోజ్.. ఎంతమందికి పరీక్షలు చేశారంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం క్లోజ్ అయింది. దాదాపు అన్ని జిల్లాల్లో సెకండ్ ఫేజ్ టాస్క్ పూర్తి చేసినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. గతంలో షెడ్యూల్ ప్రకారం కొన్ని చోట్ల క్యాంపులు నిర్వహించలేకపోయారు. ఆయా ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వం అధికారికంగా పెట్టుకున్న లక్ష్యం జూన్ 15 లోపు పూర్తి చేస్తామని వైద్యాధికారులు వివరించారు. అయితే మెజార్టీ జిల్లాల్లో దగ్గర చూపు సమస్య ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నట్లు కంటి వెలుగు –2 కార్యక్రమం ద్వారా గుర్తించారు.
వీరికి అద్దాలతో పాటు మందులు, అవసరమైన వారికి విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ మెడిసిన్స్ అందజేశారు. 50 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా కంటి శుక్లాల సమస్యతో బాధపడుతున్నారు. వీరికీ మందులతో పాటు అద్దాలూ ఇచ్చారు. అవసరమైన వారికి సర్జరీలకూ రిఫర్‌చేశారు. కంటి వెలుగు–2 ప్రోగ్రామ్‌లో ఇప్పటి వరకు 1,58,35,947 మందికి స్క్రీనింగ్ చేయగా, వీరిలో 1,18,26,614 మందికి ఎలాంటి సమస్యలు లేవని కంటి డాక్టర్లు నిర్ధారించారు. అయితే పరీక్షల కోసం వస్తున్నవారిలో 40 ఏళ్లు పైబడినవారే అధికంగా ఉన్నారు.
రెండో విడతలో కోటి 58 లక్షల మంది
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో కోటి 58 లక్షల మందికి స్క్రీనింగ్ చేశారు. వీరిలో 74,42,435 మంది పురుషులు, 83,73,097 మంది స్త్రీలు ఉన్నారు. మరో 10,955 మంది ట్రాన్స్‌జెండర్లకు కంటి పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 22,21,494 మందికి రీడింగ్ గ్లాస్‌లు, 17,86,977 మందికి ప్రిస్కిప్షన్గ్లాసులు ఇచ్చారు. స్క్రీనింగ్ చేసిన వారిలో 1,18,26,614 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్లు గుర్తించారు.
ఏఆర్ మిషన్లకు, వెహికల్స్‌కు చెల్లించని అద్దె
కంటి వెలుగు కార్యక్రమం – 2 పూర్తైనప్పటికీ ఇప్పటి వరకు ఏఆర్మిషన్లకు (పరీక్ష పరికరాలు), టీమ్‌లు, ఎక్విప్‌మెంట్‌లను సెంటర్లకు తరలించే వాహనాలకు అద్దెలు ఇవ్వలేదని తెలుస్తోంది. చాలా జిల్లాల్లో వాహనదారులు ఇప్పటికే డీహెచ్‌హెచ్‌వోలకు రిక్వెస్టు చేస్తున్నారు. రెండు నెలల నుంచి రెంట్ అందని వాళ్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు కంటి వెలుగు కేంద్రాల్లో పనిచేసిన సిబ్బందికి రోజువారి వేతనాలు ఇచ్చారు. మంత్లీ వైజ్‌గా ఇస్తామని తొలుత చెప్పి హాలిడేలను తొలగించినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.