- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vijay Deverakonda: ఆకట్టుకుంటోన్న ‘హోం టౌన్’ ట్రైలర్.. దీనిపై విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే?

దిశ, సినిమా: మన ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు (Memories), బంధాల (Bonds) నేపథ్యంతో తెరకెక్కుతోన్న లేటెస్ వెబ్ సిరీస్ (Web series) ‘హోం టౌన్’ (Home Town). రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించగా.. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రిలీజ్ చేశాడు. అనంతరం ‘హోం టౌన్’ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని చెప్పి.. టీమ్‌కు తన బెస్ట్ విశెస్ అందించారు.
ఇక ట్రైలర్ (Trailer) విషయానికి వస్తే.. ఎమోషన్ (emotion) అండ్ ఎంటర్‌టైన్‌మెంట్(Entertainment)తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. అలాగే ఉపాధి కోసం సొంతూర్లను వదిలి వచ్చినా.. ఆ జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేం అనే కంటెంట్‌ను మంచిగా చూపించారు. ఇక జ్యోతి ఫొటో స్టూడియో జీవనోపాధిగా ఉన్న రాజీవ్ కనకాల.. తన కొడుకు శ్రీకాంత్‌ను విదేశాల్లో చదివించి గొప్ప స్థాయిలో చూడాలనుకుంటాడు. కానీ శ్రీకాంత్ ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే ఓ సగటు మధ్య తరగతి కుర్రాడు, అతనికి చదువుల మీద శ్రద్ధ ఉండదు. ఇక్కడే కుటుంబంలో సంఘర్షణ ఏర్పడుతుంది. తండ్రి కోరుకున్నట్లు శ్రీకాంత్ విదేశాల్లో చదివేందుకు ఒప్పుకున్నాడా లేదా, కొడుకును విదేశాల్లో చదివించేందుకు మధ్య తరగతి తండ్రి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది హోం టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. ప్రజెంట్ ఈ ట్రైలర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.