దొంగతనం కేసులో నిందితునికి ఎన్నేళ్లు శిక్ష పడిందో తెలుసా ?

by Sridhar Babu |
దొంగతనం కేసులో నిందితునికి ఎన్నేళ్లు శిక్ష పడిందో తెలుసా ?
X

దిశ, వేములవాడ : ఒక వ్యక్తిని మోసం చేసి రూ. 50 వేలు దొంగతనం చేసిన కేసులో నిందితునికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ వేములవాడ కోర్టు తీర్పు ఇచ్చినట్లు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ మంగళవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ఎంఎల్ నారాయణ వేములవాడ ఆర్టీసీ బస్ డిపోలో ఏడీసీగా పని చేస్తుండగా హైదారాబాద్ లోని అల్వాల్ మచ్చ బొల్లారంనకు చెందిన రోహిత్ బాబూలాల్ కాలే(27)అనే యువకుడు నారాయణను మోసం చేసి రూ. 50 వేలు దొంగతనం చేశాడు.

ఈ విషయంపై నారాయణ 28.10.2023 రోజున వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కి తరలించారు. విచారణ అనంతరం విచారణ అధికారి అంజయ్య కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా సీఎంఎస్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సురేష్ సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున విక్రాంత్ కేసు వాదించారు. ఈ క్రమంలో కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నిందితునికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు సీఐ వీరప్రసాద్ పేర్కొన్నాడు.

Next Story

Most Viewed