- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర సాధనలో డీఎస్ పాత్ర మరువలేనిది.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సాధనలో డీఎస్ పాత్ర మరువలేనిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. డీఎస్ మరణం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, రెండు సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డీఎస్ అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ఆరంభించిన డీఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండుసార్లు పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చడంతో పాటు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో డీఎస్ చేసిన కృషి మరువలేనిదన్నారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం డి.శ్రీనివాస్ నిరంతరం పాటుపడేవారని తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.