- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి పూట సరదాగా బైట తిరుగుతున్నారా.. జాగ్రత్త మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయొచ్చు!
దిశ, డైనమిక్ బ్యూరో: అర్ధరాత్రి పూట సరదాగా బయట తిరుగుతున్నారా? అయితే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రాత్రి సమయంలో జరిగే నేరాలను అరికట్టేందుకు గతంలో “ఆపరేషన్ చబుత్ర” పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆపరేషన్ చబుత్రాలో భాగంగా కారణం లేకుండా రాత్రిపూట వీధుల్లో తిరుగుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇస్తారని పోలీసులు చెబుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురైనాయి.
ఏ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకుంటున్నారని యాక్టివిస్ట్‌లు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ ఆపరేషన్ చబుత్ర మొదలైందని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఇటీవల సిరిసిల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ చబుత్రలో భాగంగా, ఏ కారణం లేకుండా తిరుగుతున్న 256 మంది యువతను మరి 81 ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకుని వారికి కౌన్సిలింగ్ అందించారు. దీంతో ఈ టాపిక్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది.