బంగారం ధర తగ్గింది.. టమాటో రేట్ పెరిగింది! ఒక్కరోజే ఎంత ఎగబాకిందంటే..?

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-07-24 15:39:10.0  )
బంగారం ధర తగ్గింది.. టమాటో రేట్ పెరిగింది! ఒక్కరోజే ఎంత ఎగబాకిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బంగారంపై 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో గోల్డ్ ధరలు పడిపోయాయి. బడ్జెట్‌కు ముందుకు 10 గ్రాముల బంగారం ధర రూ.73 వేల పైచిలుకు ఉండగా.. 6 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ఒకేసారి మూడు వేల రూపాయల వరకు పసిడి ధర పతనం అయింది. దీంతో మహిళలకు పండుగ వాతావరణం నెలకొంది. కానీ వంటింట్లోకి రాగానే వారి సంతోషాన్ని ఆవిరి చేసింది టమాటో. మంగళవారం వరకు 40-50 రూపాయలకు కిలో చొప్పున దొరికిన టమాటో ఏకంగా రూ.100 ఎగబాకింది.

బుధవారం బహిరంగ మార్కెట్లో రూ.100 నుంచి రూ.120 మధ్య టమాటో ధర పలుకుతుంది. నాసిరకం టమాటో సైతం 70-80 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఏకకాలంలో అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఈ ధరలు పెరిగాయి. ఇదే బాటలో క్యాప్సికం, పచ్చిమిర్చి నడుస్తున్నాయి. పచ్చిమిర్చి కిలో రూ.160 , క్యాప్సికం కిలో రూ.160 , క్యారెట్ కిలో రూ.160 లకు చేరాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాయకూరల తోటలకు తీవ్రనష్టం జరుగుతోంది. దీంతో మార్కెట్‌కు అరకొరగానే కూరగాయల స్టాక్ వస్తుంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులకు వెజ్ టేబుల్స్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచేశారు. ఈ కారణంగానే కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయని రిటైల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.

Read More..

AP News:ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు..?

Advertisement

Next Story

Most Viewed